Share News

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:04 PM

హిందుత్వం అంటే మతం కాదని.. జీవన విధానమని భారతదేశ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దేశభక్తి సమాజ ఐక్యత లోపిస్తే దేశం వెనకబడుతుందని పేర్కొన్నారు.

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు
Venkaiah Naidu

కృష్ణా జిల్లా, జులై 30 (ఆంధ్రజ్యోతి): హిందుత్వం అంటే మతం కాదని.. జీవన విధానమని భారతదేశ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు. దేశభక్తి సమాజ ఐక్యత లోపిస్తే దేశం వెనకపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ‘కర్మవీరులారా కదిలి రండి‘ గీతం ఆవిష్కరణ, విద్యార్థులతో మాట - మంతిలో పాల్గొని వెంకయ్యనాయుడు ప్రసంగించారు.


వందేమాతరం గీతం మనందరికీ సమాధానం..

మంచి గీతాలు వినాలని, తద్వారా స్ఫూర్తిని పొందాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వందేమాతరం గీతం మనందరికీ సమాధానమని తెలిపారు. అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని సూచించారు. శక్తివంతమైన భారత్ కావాలంటే యువతి, యువకుల పాత్రే కీలకమని ఉద్ఘాటించారు. మొబైల్ ఫోన్, యూట్యూబ్‌లపై యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని చెప్పుకొచ్చారు. యువత మంచి గురువును ఎంచుకోవాలని, విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను ఎక్కువగా చదవాలని సూచించారు. యువత తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకునే స్థాయికి ఎదగాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్

ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 12:15 PM