Share News

పవన్ కల్యాణ్ ఆదేశాలతో కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు

ABN , Publish Date - Jul 31 , 2026 | 08:53 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో అత్తిలిలో లేస్, నేత కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. 15 మందికి త్వరలోనే క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయనున్నారు.

పవన్ కల్యాణ్ ఆదేశాలతో కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, జులై 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఆదేశాలతో అత్తిలిలో లేస్, నేత కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. 15 మందికి త్వరలోనే క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయనున్నారు. హస్త కళాకారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను పవన్ కల్యాణ్ ఏర్పాటు చేయించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం వేదికగా కళాకారులకు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొస్తూ ఇప్పటి వరకు కొండపల్లి, నరసాపురం, పాలకొల్లు, బొబ్బిలి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు.


కళాకారుల ఆరోగ్యమే వారి కళకు బలమనే భావనతో నిరంతరం ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో ఆ ప్రాంత లేస్, నేత కళాకారుల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 143 మంది కళాకారులకు కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 15 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు. వారికి త్వరలోనే ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 110 మందికి ఉచితంగా కళ్లద్దాలను అందజేయనున్నారు.


వార్తలు కూడా చదవండి...

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 09:37 PM