భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు
ABN , Publish Date - Jul 31 , 2026 | 07:04 PM
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. థింసా నృత్యంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా, జులై 31 (ఆంధ్రజ్యోతి): భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. థింసా నృత్యంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. గిన్నిస్ అవార్డును మంత్రి అందుకున్నారు. రేపు (శనివారం) భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆదివాసీలు అపూర్వ స్వాగతం పలకనున్నారు. గత మూడు రోజులుగా ఆదివాసీ విద్యార్థినులు రిహార్సల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆదివాసీ విద్యార్థినులు తరలివచ్చి ఈ థింసా నృత్యంలో పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా ఏర్పాట్లు..
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘన స్వాగతం చెప్పేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సంప్రదాయ థింసా నృత్యంతో రేపు (శనివారం) 16 వేల మంది మంది ఆదివాసీ బాలికలు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలు, కళలు ఉట్టిపడేలా అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు అలంకరించారు.
ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు..
విమానాశ్రయ స్వాగత ద్వారం వద్ద ఆకట్టుకునేలా భారీ స్థాయిలో ఏటికొప్పాక కళాకృతిలో అలంకరించారు. విమానాశ్రయం లోపల ప్రాంగణంలో ఏపీ చారిత్రక వైభవం చాటేలా తోలు బొమ్మలాట, బొబ్బిలి వీణ, భౌగోళిక వారసత్వం చాటిచెప్పేలా బంగినపల్లి మామిడి లాంటి చిత్రాలతో అలంకరించారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇవాళ(శుక్రవారం) సాయంత్రం విశాఖపట్నం బీచ్ రోడ్డులో డ్రోన్ షో కనువిందు చేయనుంది. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసుల నిర్వహణ కోసం ఎయిర్ ఇండియా షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
వార్తలు కూడా చదవండి...
హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు
గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News