Share News

నమో సహకారంతోనే ఏపీలో అనేక అభివృద్ధి పనులు: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:10 PM

ఉత్తరాంధ్ర కలలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెక్కలు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. విభజన వల్ల చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

నమో సహకారంతోనే ఏపీలో అనేక అభివృద్ధి పనులు: మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

విజయనగరం జిల్లా, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర కలలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెక్కలు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ప్రశంసించారు. విభజన వల్ల చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు (శనివారం) భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని లోకేశ్ మాట్లాడారు. విశాఖ ఉక్కును కాపాడింది మోదీనే అని కొనియాడారు. నమో కా మతలబ్‌.. హిమ్మత్‌, విశ్వాస్‌, సురక్షిత్‌ భారత్‌, దుష్మన్‌ కో ఢర్‌ అని ప్రశంసించారు.


ఏపీ అభివృద్ధికి మోదీ పూర్తిగా సహకరిస్తున్నారు..

ఏపీ అభివృద్ధికి మోదీ పూర్తిగా సహకరిస్తున్నారని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. నమో సహకారంతోనే ఏపీలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడారని తెలిపారు. ఎర్రబస్సు రానిచోట ఎయిర్‌ బస్‌ అవసరమా అని కొందరు అన్నారని విమర్శించారు. తక్కువగా చూసి ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించారని ధ్వజమెత్తారు. ఎర్రబస్సు రాదన్న చోటుకి ఎయిర్‌పోర్టు వచ్చిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు

పవన్ కల్యాణ్ ఆదేశాలతో కళాకారులకు ఉచిత కంటి పరీక్షలు

ఏపీలో విపత్తు నిర్వహణ వ్యవస్థలపై కేంద్ర ఉన్నతాధికారుల సమీక్ష

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 12:27 PM