Share News

డ్రగ్స్ ర‌హిత ఏపీ కోసం కృషి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - Aug 02 , 2026 | 02:59 PM

మత్తు రహిత సమాజమే లక్ష్యంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కృత‌జ్ఞత‌లు తెలిపారు.

డ్రగ్స్ ర‌హిత ఏపీ కోసం కృషి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మత్తు రహిత సమాజమే లక్ష్యంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కృత‌జ్ఞత‌లు తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనపై దేశవ్యాప్తంగా వంద వారాల కార్యక్రమాన్ని జాతీయ ఉద్యమంగా నిర్వహించాల‌ని ప్రధాని పిలుపు ఇచ్చారని చెప్పుకొచ్చారు.


ఈ జాతీయ ఉద్యమంలో అంద‌రం భాగమవుదామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పేరుతో ఎన్నో చైత‌న్య కార్యక్రమాలు నిర్వహించామని ప్రస్తావించారు. ఈగ‌ల్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి స‌మాజ‌ భాగ‌స్వామ్యంతో డ్రగ్స్ ర‌హిత ఆంధ్రప్రదేశ్ కోసం అలుపెరుగ‌ని కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు: సీఎం చంద్రబాబు

నమో సహకారంతోనే ఏపీలో అనేక అభివృద్ధి పనులు: మంత్రి లోకేశ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 03:33 PM