Share News

అభివృద్ధి కార్యక్రమాలు జగన్‌కు నచ్చవు: ఎంపీ కలిశెట్టి

ABN , Publish Date - Aug 03 , 2026 | 01:20 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే జగన్‌కు నచ్చవని విమర్శించారు.

అభివృద్ధి కార్యక్రమాలు జగన్‌కు  నచ్చవు: ఎంపీ కలిశెట్టి
TDP MP Kalisetti Appala Naidu

ఢిల్లీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (TDP MP Kalisetti Appala Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే జగన్‌కు నచ్చవని విమర్శించారు. ప్రజల్లో జగన్‌పై చర్చ జరుగుతుందని తెలిపారు. ఈరోజు (సోమవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో ఎంపీ కలిశెట్టి మాట్లాడారు. జగన్ తన మీడియాలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను తాను సాధించానని చెప్పుకుంటున్నారని అన్నారు. ఈ విమానాశ్రయం ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టి జగన్ సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. జగన్ ఉత్తరాంధ్ర పర్యటన చేసి సాధించింది ఏమిటి.? అని ప్రశ్నించారు.


గడువు ముందే భోగాపురం విమానాశ్రయం పూర్తి చేశాం..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ భోగాపురం పర్యటనను సైతం జగన్ రెడ్డి డిస్టర్బ్ చేశారని ఎంపీ కలిశెట్టి ఆగ్రహించారు. భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభించారని ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర ప్రజల తరఫున ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ను మూడు లక్షల మంది ప్రజల సమక్షంలో జాతికి అంకితం చేశారని చెప్పుకొచ్చారు. గడువు ముందే భోగాపురం విమానాశ్రయం పూర్తి చేశామని తెలిపారు.


ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్‌గా భోగాపురం ఎయిర్‌పోర్ట్

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్‌గా భోగాపురం ఎయిర్‌పోర్ట్ మారబోతుందని ఎంపీ కలిశెట్టి వివరించారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను బాధ్యతగా పూర్తి చేస్తున్నారని వెల్లడించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చంద్రబాబు నాయకత్వంలో పరుగులు పెడుతుందని చెప్పుకొచ్చారు. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ఉపాధి కోసం ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి వలసలు ఆగిపోయాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం పూర్తి చేయడంలో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

కేంద్ర పన్నుల వాటాతో ఏపీ అభివృద్ధి మరింత వేగవంతం: సీఎం చంద్రబాబు

డ్రగ్స్ ర‌హిత ఏపీ కోసం కృషి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

పొగాకు రైతులకు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 03 , 2026 | 01:39 PM