Share News

లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలి.. వైసీపీపై మంత్రి అనగాని ధ్వజం

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:12 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఆయనకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. ఈరోజు(మంగళవారం) అమరావతి వేదికగా మంత్రి అనగాని మీడియాతో మాట్లాడారు.

లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలి.. వైసీపీపై మంత్రి అనగాని ధ్వజం
AP Minister Anagani Satyaprasad

అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ (AP Minister Anagani Satyaprasad) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఆయనకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. ఈరోజు (మంగళవారం) అమరావతి వేదికగా మంత్రి అనగాని మీడియాతో మాట్లాడారు. తాము ప్రతిపక్షంలో ఉండగా రైతులతో కలిసి పాదయాత్ర చేశామని ప్రస్తావించారు. చంద్రబాబుపై ఉన్న అక్కసుతో జగన్ అమరావతిపై నాడు విషం చిమ్మారని ఆగ్రహించారు. అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చాక అమరావతిపై జగన్ బురద జల్లారని ఫైర్ అయ్యారు. ముందు రాజధాని అమరావతికి ఒకే అన్నారని.. ఆ తర్వాత మూడు రాజధానులు, మావిగాన్ అన్నారని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో విధ్వంసం తర్వాత అమరావతిలో కట్టడాలు పటిష్ఠతపై తాము రిపోర్టు తీసుకొని రెండేళ్లలో పూర్తి చేశామని స్పష్టం చేశారు.


భోగాపురంపై జగన్ అడ్డుపుల్ల వేశారు..

అమరావతి నిర్మాణంలో ఉన్న భవనాలు అన్ని త్వరలోనే హ్యాండ్ ఓవర్ చేస్తామని మంత్రి అనగాని చెప్పుకొచ్చారు. డయాగ్రిడ్‌ను భారతదేశంలో తొలిసారిగా ఐకానిక్ బ్రిడ్జి‌లో వాడామని తెలిపారు. 2015లో భోగాపురం విమానాశ్రయం బేసిక్ డాక్యుమెంట్ తయారైందని అన్నారు. ఆ తర్వాత భోగాపురంపై జగన్ అడ్డుపుల్ల వేశారని దుయ్యబట్టారు. నాడు మహిళలు అని కూడా చూడకుండా అమరావతి రైతులను హింసించారని మండిపడ్డారు. మంత్రి నారా లోకేశ్ రిజైన్ చేయాలని వైసీపీ నేతలు అంటున్నారని.. ఆయన ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. తల్లికి వందనం, మెగా డీఎస్సీ, మెగా పీటీఎం పెట్టినందుకా లోకేశ్ రాజీనామా చేయాలని నిలదీశారు. ఆ పార్టీలో సైకిక్ ప్రాబ్లం ఉన్న నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. స్టాన్‌ఫర్డ్ పేరు పలికే అర్హత కూడా గొడ్డలి పార్టీ నేతలకు లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు.


రైతులను జగన్ ఇబ్బంది పెట్టారు: మంత్రి సవిత

Minister-Savitha.jpg

రాజధాని అమరావతిని పూర్తి చేస్తామని చెప్పి జగన్ అధికారంలోకి వచ్చాక రైతులను ఇబ్బంది పెట్టారని ఏపీ మంత్రి సవిత (AP Minister Savitha) ఆగ్రహించారు. ఈరోజు (మంగళవారం) అమరావతి నిర్మాణాలను సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. 30 వేల మంది కార్మికులతో అమరావతిలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా పనులు జరుగుతున్నాయని వివరించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్జి బంగ్లా, మంత్రుల బంగ్లాలు ఇలా అన్ని రెడీ అవుతున్నాయని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులు అని జగన్ చెప్పి ప్రజలను మభ్యపెట్టరని విమర్శించారు. ఇప్పుడేమో డైవర్షన్ పాలిటిక్స్‌కు వైసీపీ నేతలు దిగుతున్నారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రలో ఎయిర్‌పోర్ట్ ప్రారంభంపై కూడా గొడ్డలి పార్టీ నేతలు విషం చిమ్మారని మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


వార్తలు కూడా చదవండి...

డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

కామన్వెల్త్ గేమ్స్ అద్భుతంగా ముగిశాయి: పవన్ కల్యాణ్

అభివృద్ధి కార్యక్రమాలు జగన్‌కు నచ్చవు: ఎంపీ కలిశెట్టి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 04 , 2026 | 11:41 AM