జల్ జీవన్ పనుల్లో వేగం పెంచాలి: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Aug 04 , 2026 | 02:23 PM
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఈరోజు (మంగళవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జల్ జీవన్ పనుల్లో మరింతగా వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తీర ప్రాంతాల తాగునీటికి జల్ జీవన్‌తో భద్రత కల్పించాలని వెల్లడించారు. లక్ష్యం దిశగా అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పనులు వచ్చాయని తెలిపారు.
రెండు ప్రాజెక్టుల కింద రూ.270 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ఆయా నిర్మాణాల పనులను వేగవంతం చేశామని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. 400 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ నిర్మాణం పూర్తి చేశామని వివరించారు. నాణ్యత ప్రమాణాలను స్వయంగా తాను పరిశీలిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
కామన్వెల్త్ గేమ్స్ అద్భుతంగా ముగిశాయి: పవన్ కల్యాణ్
అభివృద్ధి కార్యక్రమాలు జగన్‌కు నచ్చవు: ఎంపీ కలిశెట్టి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News