Home » AP Governor Abdul Nazeer
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభ మేళా దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా, సంస్కృతికి చిహ్నం గా నిలుస్తుందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు.
జగన్ ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. దేశం పరువును అదానీ, ఏపీ పరువును జగన్ తీసేలా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సాయంత్రం విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభంతోపాటు రాష్ట్రంలోని చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్‌కు సీఎం చంద్రబాబు వివరించినట్లు తెలుస్తుంది.
దివ్యాంగుల నైపుణ్యాన్ని అందరూ ప్రోత్సహించాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఏయూ మెరైన్ గ్రౌండ్స్‌లో జాతీయ స్థాయి దివ్య కళా మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి ఈరోజు(గురువారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్, విశాఖ ఎంపీ శ్రీ భరత్ పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని.. నేటికి రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు.
అసెంబ్లీ సమావేశాలు రేపటి( శుక్రవారం) నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) రాజ్‌భవన్‌లో ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక కోసం రెండు రోజులపాటు సమావేశం కానుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రొటెం స్పీకర్ అనే పదం ఎక్కువుగా వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.27 గంటలకు కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నారా చంద్రబాబు నాయుడును గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆహ్వానించారు.
రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎన్డీయే కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరపున అచ్చె్న్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేశారు.