దుబాయ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. 20 నిమిషాల్లో 7 సార్లు పేలుళ్లు..
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:56 AM
గల్ఫ్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుబాయ్‌లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంతో పాటు పోర్టు సమీపంలో బుధవారం తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుబాయ్‌లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంతో పాటు పోర్టు సమీపంలో బుధవారం తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. 20 నిమిషాల వ్యవధిలో ఏడు సార్లు పేలుళ్లు జరిగినట్లు పేర్కొన్నాయి. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో యెమెన్ నుంచి యూఏఈపై క్షిపణి దాడులు జరిగినట్లు ఇరాన్ న్యూస్ ఏజెన్సీ మెహర్ తెలిపింది. పేలుళ్లకు గల కారణంపై యూఏఈ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
పోర్టుకు సమీపంలోని ఆయిల్ వేర్‌హౌస్‌లలో అగ్ని ప్రమాదం జరగటం వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని మరికొన్ని న్యూస్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టం ఎంత జరిగిందన్న దానిపై అధికారిక సమాచారం లేదు. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తరచుగా దాడులు చేస్తుండటంతో యూఏఈ హైఅలర్ట్ ప్రకటించింది. పారిశ్రామిక ప్రాంతంతో దట్టమైన పొగలు ఎగసి పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌కు ముందే కోహ్లీ అరంగేట్రం.. తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు ఆడాడో తెలుసా?
పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన మంత్రి లోకేశ్