Share News

అభివృద్ధిని చూసి జగన్ అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారు.. కోటంరెడ్డి సెటైర్లు

ABN , Publish Date - May 08 , 2026 | 11:25 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ అండ్ కో చూసి జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.

అభివృద్ధిని చూసి జగన్ అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారు.. కోటంరెడ్డి సెటైర్లు
Kotamreddy Sridhar Reddy

నెల్లూరు జిల్లా, మే 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ అండ్ కో జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పరిస్థితి రోజురోజుకూ అగమ్యగోచరంగా మారుతోందని ఎద్దేవా చేశారు. ఈరోజు (శుక్రవారం) నెల్లూరు వేదికగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ఏపీలో రాజధాని పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు.


పేదలకు సంక్షేమ ఫలాలు..

పోలవరం పరుగులు పెడుతోందని.. పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు కృషితో పరిశ్రమలు పెద్దఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు. వైసీపీ నేతలు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. జగన్ అండ్ కో ఆరోపణలను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని విమర్శించారు. వైసీపీ హయాంలో ఏపీని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్‌కి రూ.658కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 15వ తేదీన రూ.17కోట్లతో 168 పనులకు శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.


ఆ పనులను 60 రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు ఈ వయస్సులోనూ రాష్ట్ర అభివృద్దికి ఎంతగానో పాటుపడుతున్నారని వ్యాఖ్యానించారు. పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పిస్తూ మంత్రి నారా లోకేశ్ పెట్టుబడులను ఏపీకి తీసుకువస్తున్నారని చెప్పుకొచ్చారు. ఐటీ ఉద్యోగులు అందరూ చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు గళం వినిపించారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు: సీఎం చంద్రబాబు

పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి వర్మ తొలగింపు

ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. ప్రజలను అవమానించడమే: కమల్ హాసన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 08 , 2026 | 12:02 PM