ఆ కేసులో జగన్ హస్తంపై ఓపెన్ పోలింగ్ పెట్టాలి: సీఎం రమేశ్
ABN , Publish Date - May 23 , 2026 | 11:49 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రౌడీషీట్ ఉందని విమర్శించారు.
అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రౌడీషీట్ ఉందని విమర్శించారు. ఓ కులాన్ని అడ్డం పెట్టుకుని దొంగతనాలు చేయించి డబ్బు గడించిన చరిత్ర రాజారెడ్డిదని ఎద్దేవా చేశారు. ఈరోజు (శనివారం) అమరావతి వేదికగా మీడియాతో ఎంపీ రమేశ్ మాట్లాడారు. ఓ మైన్ ఓనర్‌ను అంతమొందించి రాజారెడ్డి గనులు దక్కించుకుని ధనవంతుడయ్యారని విమర్శించారు. పులివెందులలో రాజారెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని చెప్పుకొచ్చారు. వైఎస్ ఎలా చనిపోయారో అందరికీ తెలుసునని... ఈ విషయంలో జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారని సెటైర్లు గుప్పించారు.
రాజకీయాలు వదిలేస్తా..
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని, మాజీ మంత్రి వివేకారెడ్డి మరణాన్ని జగన్ వేరేలాగా చిత్రీకరిస్తున్నారని ఎంపీ రమేశ్ అన్నారు. వివేకా హత్య కేసులో జగన్ హస్తం ఉందా..?, లేదా..? అనేది ఓపెన్ పోల్ పెట్టాలని సవాల్ చేశారు. ఈ కేసుతో జగన్‌కి సంబంధం లేదని వస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. ప్రజలకు జగన్ హత్యా రాజకీయాల గురించి తెలిసిపోయిందని.. అందుకే ఆయన ఇప్పుడు తాను మంచివాడిని అని చెబుతున్నారని అన్నారు. వివేకా కేసులో సీబీఐ విచారణ చేసి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిందని ప్రస్తావించారు. ఎస్టీ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజారెడ్డి దోపిడీలు చేశారని.. ఇలా పోలీసుల రికార్డుల్లో కూడా ఉందని గుర్తుచేశారు. పులివెందులలో పార్నపల్లి గ్రామంలో రాజారెడ్డి చేసిన ఆకృత్యాలకు ఇంకా సజీవ సాక్షులు ఉన్నారని చెప్పుకొచ్చారు. రాజారెడ్డి ఎందరినో రాజకీయ లబ్ధి కోసం హత్య రాజకీయాలు చేశారని ఆరోపించారు. రాజారెడ్డిని హత్య చేసింది ఆయన వల్ల ఇబ్బంది పడిన బాధితులేనని చెప్పుకొచ్చారు. రాజారెడ్డి మీద రౌడీషీట్ సహా పలు కేసులు గతంలో ఉన్నాయని ప్రస్తావించారు. ఆ సమయంలో చంద్రబాబు సీఎం కాదని.. టీడీపీ ప్రభుత్వమే లేదని ఎంపీ సీఎం రమేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడులో 20 తీర్మానాలు.. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ
తాగునీటి నాణ్యతపై రాజీ పడొద్దు.. అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News