Share News

తాగునీటి నాణ్యతపై రాజీ పడొద్దు.. అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు

ABN , Publish Date - May 21 , 2026 | 08:40 PM

తాగునీటి నాణ్యతపై రాజీపడొద్దని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు కీలక అంశాలపై డిప్యూటీ సీఎం చర్చించారు.

తాగునీటి నాణ్యతపై రాజీ పడొద్దు.. అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
AP Deputy CM PawanKalyan

అమరావతి, మే21 (ఆంధ్రజ్యోతి): తాగునీటి నాణ్యతపై రాజీపడొద్దని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు(గురువారం) సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు కీలక అంశాలపై డిప్యూటీ సీఎం చర్చించారు. నెల రోజుల్లోగా ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్ పూర్తి కావాలని సూచించారు. పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. గృహ అవసరాలకూ పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని నిర్దేశించారు.


ఫిల్టర్ బెడ్లను నెలరోజుల్లో శుభ్రం చేయాలి..

వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నీటి నాణ్యత పరిశీలనకు ఎఫ్‌టీకే కిట్లను ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెలరోజుల్లో శుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై స్వయంగా ప్రతి నెల ప్రత్యేకంగా సమీక్షిస్తామని తెలిపారు. పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించొద్దని ఆదేశించారు. ప్రభుత్వం ఆమోదించిన మరో 7 మల్టీ విలేజ్ స్కీమ్స్ తాగునీటి పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను తొందరగా పూర్తి చేసి, వెంటనే వాటిని క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని పవన్ కల్యాణ్ మార్గనిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది: సీఎం చంద్రబాబు

నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 08:47 PM