దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్
ABN , Publish Date - May 20 , 2026 | 02:48 PM
దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో డీఈవోలు, ఏపీసీలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. ఈరోజు(బుధవారం) సచివాలయంలో డీఈవోలు, ఏపీసీలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్‌పై అధికారులు దృష్టిసారించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంతబిడ్డల్లా భావించి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ రావాలని మంత్రి నారా లోకేశ్ మార్గనిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం
స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News