దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్
ABN , Publish Date - May 20 , 2026 | 06:23 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు విదేశీ ప్రయాణాలు తగ్గించి.. దేశీయ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఇంధన పొదుపుతో పాటు విదేశీ ప్రయాణాలు తగ్గించాలని ప్రధాని కోరారని పేర్కొన్నారు.
అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు విదేశీ ప్రయాణాలు తగ్గించి.. దేశీయ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (AP Tourism Minister Kandula Durgesh) వ్యాఖ్యానించారు. ఇంధన పొదుపుతో పాటు విదేశీ ప్రయాణాలు తగ్గించాలని ప్రధాని కోరారని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) ఏపీ సచివాలయం వేదికగా మంత్రి కందుల దుర్గేశ్ మీడియాతో మాట్లాడారు. టూరిజం విషయంలో బయటదేశాలకు వేళ్లేవారు ఎక్కువని.. మన దేశానికి వచ్చేవారు తక్కువని చెప్పుకొచ్చారు. దీని వల్ల విదేశీ మారక ద్రవ్యం ఖర్చయిపోతుందని అన్నారు. దీంతో హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే క్యాంపెయిన్‌ను చేయాలని తాము నిర్ణయించామని తెలిపారు.
పర్యాటకులను ఆకర్షించలేకపోతున్నాం..
ఏడాది పాటు ఈ నినాదంతో పనిచేయాలని నిర్ణయించామని.. ఈ విషయంపై టూరిజం స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. టూరిజం సర్కూట్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మనకు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం తిరుపతి వంటి పర్యాటక ప్రాంతాలపై చాలామంది ఆసక్తి కనపరుస్తారని వెల్లడించారు. గ్రాండ్ క్యానియన్, అరకు లాంటివి ఉన్నా మన వద్ద అనుకున్నంతగా పర్యాటకులను ఆకర్షించలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. మహరాష్ట్ర తర్వాత ఏపీలోని వారే బయట దేశాల్లో ఉన్నారని.. అలాంటి వారిని ఇక్కడకు రావాలని కోరామని అన్నారు. స్టేక్ హోల్డర్స్ అందరూ తమకు కో ఆపరేట్ చేస్తామన్నారని తెలిపారు. టూర్ ఆపరేటర్‌లు సర్కూట్‌లు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించాలని నిర్ణయించామని అన్నారు.
ఏపీకి ఎయిర్ కనెక్టివిటీ చాలా ఉంది..
బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రచ్చర్ డెవలెప్ చేయడంతో ఏపీ, కేంద్రం, సీఎస్ఆర్ సహకారం తీసుకోవాలని నిర్ణయించామని మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. త్రీ డేస్ ఇన్ తిరుపతి వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. ఈ క్యాంపెయిన్‌కు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల సర్వీసులు వినియోగించుకుంటామని అన్నారు. ఏపీకి ఎయిర్ కనెక్టివిటీ చాలా ఉందని చెప్పుకొచ్చారు. ఏపీకి అన్నిరకాల కనెక్టివిటీలు ఉన్నాయని ప్రస్తావించారు. భద్రతా ప్రమాణాలను టూరిజంలో పెంచడానికి టాప్ ప్రయార్టీ ఇచ్చామని తెలిపారు. సర్వీసెస్ ఫెసిలిటీస్ ఇచ్చే వారి విషయంలో ఆధునికీకరిస్తున్నామని అన్నారు. రెండేళ్లతో పోలిస్తే పరిస్ధితులు చాలావరకూ మెరుగయ్యాయని తెలిపారు. అన్ని స్టేక్ హోల్డర్‌లతో కలిసి స్పెషల్ ప్యాకెజీలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. పర్యటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా టూరిజం 17.75 శాతం వృద్ధి చెందిందని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం
స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News