CM Revanth Reddy on KCR Family: కవితను బయటకు వెళ్లగొట్టింది వారే.. సీఎం రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:28 PM
షాడో సీఎం ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. షాడో సీఎం ఎవరో ఆ వ్యక్తి పేరు, చేసిన పని ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూశానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
ఢిల్లీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం (KCR Family) లో అధికారం, ఆస్తి పంచాయితీ నడుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. కవిత (Kavitha)ను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, సంతోష్‌లేనని ఆక్షేపించారు. కేసీఆర్ కుటుంబ పంచాయితీతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
అందుకే కవిత దూరమైంది..
తెలంగాణ ఉద్యమం భావోద్వేగం పేరిట కేసీఆర్ అనేకమంది పిల్లలను పొట్టన పెట్టుకున్నారని ఆక్షేపించారు. ఆ ఉసురే ఆయనకు తాకిందని, ఫలితంగా కుమార్తె కవిత దూరమైందని విమర్శించారు. గతంలో తన కూతురు పెళ్లికి కూడా వెళ్లనివ్వకుండా కేసీఆర్ అండ్ కో అడ్డుకున్నారని.. అది చిన్న సమస్యా అని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ హైకోర్టులో ఉందని చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) హైకోర్టులో విచారణలో ఉందని.. లేదంటే దాన్ని కూడా సీబీఐ విచారణకి ఇచ్చే వాళ్లమని స్పష్టం చేశారు. కేసీఆర్ మొదటి ఐదేళ్ల ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవిలో ఎందుకు చోటు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం రేవంత్‌రెడ్డి.
బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం..
బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామనే ప్రయత్నం చేశారని కేసీఆర్ కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబంలోని ఆ నలుగురు కలిసి ఒక మహిళను ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయంపై మహిళాలోకం స్పందించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ను అరికట్టామని, పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అరికట్టలేదని నిలదీశారు. కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ మద్యంతో దొరికారని గుర్తుచేశారు. దుబాయ్‌లో చనిపోయిన డైరెక్టర్ కేదర్ ఫోరెన్సిక్ రిపోర్ట్ తమ ప్రభుత్వానికి అందిందని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
షాడో సీఎం ఆరోపణలపై ఏమన్నారంటే..
అలాగే, షాడో సీఎం ఆరోపణలపై స్పందించారు సీఎం రేవంత్‌రెడ్డి. షాడో సీఎం ఎవరో ఆ వ్యక్తి పేరు, చేసిన పని ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూశానని చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy)కి సొంత తెలివి లేదని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కేటీఆర్.. కిషన్‌రెడ్డిని అద్దెకు పెట్టుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం బహిష్కరించిందని చెప్పుకొచ్చారు. కిషన్‌రెడ్డి కాళేశ్వరం కేసు (Kaleshwaram Case)ను సీబీఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ చేయిస్తామని చెప్పారని.. ఈ కేసు ఇచ్చి చాలా రోజులు అయిందని గుర్తుచేశారు. కాళేశ్వరం కేసు విచారణను కేటీఆర్ అడ్డుకుంటున్నారని.. అందుకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం దర్యాప్తు జరుగకుండా అడ్డుకుంటుంది కిషన్ రెడ్డినేనని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి: సీఎం రేవంత్‌రెడ్డి
For More Telangana News And Telugu News