Jr NTR Accident on AD Shooting: జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..
ABN , Publish Date - Sep 19 , 2025 | 05:18 PM
సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఓ యాడ్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయమైంది. డ్రాగన్ సినిమాతోపాటు యాడ్ చిత్రీకరణలో విరామం లేకుండా ఎన్టీఆర్ పాల్గొంటున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్‌కు ప్రమాదం జరగడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంపై ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన..
అయితే, ఎన్టీఆర్‌కు జరిగిన ప్రమాదంపై ఆయన కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయని, వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తరలించామని వివరించారు. ఎన్టీఆర్‌కి రెండు వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు ఈ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్‌కు ప్రస్తుతం వైద్య చికిత్స అందుతోందని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదని.. అందుకు తాము హామీ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. దయచేసి ఫ్యాన్స్ కానీ, మీడియా కానీ లేనిపోని వార్తలను ప్రచురించవద్దని కోరారు. ఈ ప్రమాదం నుంచి ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు..!
For More Telangana News And Telugu News