Share News

CM Revanth Reddy: తెలంగాణలో ఒక ట్రంప్..

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:50 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని వివిధ దేశాలపై భారీగా టారిఫ్‌లు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy: తెలంగాణలో ఒక ట్రంప్..
CM Revanth Reddy

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పరిపాలన చేయాలంటే పొలిటికల్ విల్ చాలా అవసరమన్నారు. తెలంగాణలో సైతం ఒక ట్రంప్ ఉండే వారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఆ తెలంగాణ ట్రంప్‌ను ప్రజలు పక్కన పడేశారంటూ ఎద్దేవా చేశారు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేసే వారు ఎవరైనా ట్రంప్ అవుతారంటూ సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.


ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆప్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రంప్‌ లాంటి వ్యక్తుల ఆటలు చాలా రోజులు కొనసాగవని జోస్యం చెప్పారు. రాత్రి కలలో అనుకున్నది ట్రంప్‌ పగలు అమలు చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్‌ ఒక రోజు ప్రధాని మోదీని.. తన మిత్రుడని పేర్కొంటారన్నారు. ఆ వెంటనే భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధిస్తారంటూ ట్రంప్ వ్యవహార శైలిని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఎండగట్టారు. భారతీయులకు వీసాలు ఇవ్వకపోతే అమెరికాకే నష్టమని పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్లాస్టిక్ రహిత ఏపీ కోసం కృషి: డిప్యూటీ సీఎం

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీపై క్లారిటీ ఇచ్చిన మినిస్టర్..!

For More Telangana News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 01:11 PM