Share News

NTR Vaidya Seva: వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీపై క్లారిటీ ఇచ్చిన మినిస్టర్..!

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:43 AM

కూటమి ప్రభుత్వం కోలువు తీరి ఏడాదిన్నర అయింది. నేటికి కూటమి ప్రభుత్వం పెట్టిన పథకాల పేర్లను పెట్టించుకోకుండా.. గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మాత్రమే వ్యవహరిస్తుండడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు.

NTR Vaidya Seva: వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీపై క్లారిటీ ఇచ్చిన మినిస్టర్..!
AP Minister Satya Kumar

అమరావతి, సెప్టెంబర్ 19: కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాదిన్నర అయింది. ఆ ప్రభుత్వం పెట్టిన పేర్లను పట్టించుకోకుండా.. గత జగన్ ప్రభుత్వ పథకాల పేర్లతోనే నేటికి అసెంబ్లీ సిబ్బంది వ్యవహరిస్తుండడం పట్ల సర్వత్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి వేళ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ శుక్రవారం అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై స్పందించారు. ఆరోగ్య శ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందంటూ ఆయన వివరణ ఇచ్చారు. ఇంతలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ జోక్యం చేసుకుంటూ.. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజాధనం దారాదత్తం చేశారంటూ ఆరోపించారు. వెంటనే మంత్రి సత్య కుమార్ స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రూ. 457 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చెల్లింపులు చేసిందని వివరించారు.


అయితే ఆరోగ్యశ్రీ నిలిచి పోయిందనటంలో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మారిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇక ఎన్టీఆర్ వైద్యసేవల ద్వారా ఇప్పటికి 13, 42, 000 వేల మంది లబ్ది పొందారని గణాంకాలతో సహా ఆయన వివరించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలకు బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఆరోగ్యశ్రీ అని ఎమ్మెల్యే ప్రశ్న అడిగారని.. అయితే ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతోనే బ్రాండింగ్ జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ వివరించారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్ష కాల సమావేశాలు గురువారం అంటే.. సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా సభలో ప్రశ్నోత్తరాల జరిగాయి. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంలో డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా అమలు చేసిన పథకం పేరును వినియోగించారు. అంటే.. కూటమి ప్రభుత్వం డా. ఎన్టీఆర్ వైద్య సేవ పేరును అసెంబ్లీ సిబ్బంది పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయం మీడియా, సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ అసెంబ్లీలో పై విధంగా స్పందించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి మరో నేత!

విజయవాడకు ఎంపీ మిథున్‌రెడ్డి..

For More AP News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 12:01 PM