Share News

BIG BREAKING: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి మరో నేత!

ABN , Publish Date - Sep 19 , 2025 | 10:43 AM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మరో బిగ్ షాక్ తగిలింది. చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

BIG BREAKING: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి మరో నేత!

అమరావతి, సెప్టెంబర్ 19: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మరో బిగ్ షాక్ తగిలింది. చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం అమరావతిలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నారు. ఆయనతోపాటు పాటు పలువురు వైసీపీ నేతలు సైతం టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే వైసీపీతోపాటు ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.


2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమిలోని పార్టీలకు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవ్వడమే కాకుండా.. పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ పార్టీకి పలువురు కీలక నేతలు రాజీనామా చేశారు. అంతేకాదు.. కీలక పదవులకు సైతం వారు రాజీనామా చేశారు. ఆ జాబితాలో తాజాగా మర్రి రాజశేఖర్ సైతం చేరారు.

ఈ వార్తలు కూడా చదవండి..

విజయవాడకు ఎంపీ మిథున్‌రెడ్డి..

ఏపీ అసెంబ్లీ సిబ్బంది నిర్లక్ష్యం.. వ్యక్తమవుతున్న నిరసనలు

For More AP News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 11:00 AM