Share News

Pawan Kalyan: భారత సైన్యానికి రక్షణగా పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

ABN , Publish Date - May 09 , 2025 | 06:54 PM

Pawan Kalyan:పాకిస్తాన్ భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో ఇండియన్ ఆర్మీకి రక్షణగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక పిలుపునిచ్చారు. భారత బలగాలకు రక్షణగా పూజలు చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan:  భారత సైన్యానికి రక్షణగా పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు
Pawan Kalyan

అమరావతి: పాకిస్థాన్ మీద భారత బలగాలు చేస్తున్న ఆపరేషన్ సిందూర్ ధర్మ యుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. శత్రు మూకలపై పోరాడుతున్న సైన్యానికి, దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దైవ బలం, ఆశీస్సులు ఉండేలా భగవంతుడిని ప్రార్థించాలని అన్నారు. శత్రు సేనలను కట్టడి చేసి, దేశాన్ని కాపాడే గొప్ప శక్తిసామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిధ దళాలకు మెండుగా ఉన్నాయని చెప్పారు. వారి కోసం దేశమంతా ప్రార్థించే సమయమిదని పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ(శుక్రవారం) ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.


జనసేన పక్షాన మంగళవారం ఉదయం షష్ట షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రమ్, స్వామిమలై, పలముదిరచోళై క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించామని పవన్ కల్యాణ్ అన్నారు. ఇందులో భాగంగా ప్రతి క్షేత్రానికి ఒక శాసన సభ్యుడు, జన సైనికులను పంపించి పూజలు చేయిస్తామని చెప్పారు. కర్ణాటకలోని కుక్కే, ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్‌లోని మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయాలు, ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం, పిఠాపురం శ్రీ పురూహూతిక దేవి ఆలయాల్లో పూజలు చేయిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.


ఈ ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సైన్యానికి సూర్య శక్తి తోడుండేలా పూజలు చేస్తునట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. వీటితోపాటు రాష్ట్రంలోని వివిధ క్షేత్రాల్లోనూ సైన్యం కోసం, యుద్ధ ప్రభావం ఉన్న జమ్ము, కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హరియాణ రాష్ట్రాల ప్రజల క్షేమాన్ని కోరుతూ పూజలు చేయాలని అన్నారు. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించేవారు చర్చిల్లో, ఇస్లాం ధర్మాన్ని ఆచరించేవారు మసీదుల్లో ప్రార్థనలు చేపడతారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Operation Sindoor: ఢిల్లీ ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Operation Sindoor: మీ ఆవేదన తీర్చలేదని.. మురళీనాయక్ ఫ్యామిలికి సీఎం పరామర్శ

Supreme Court Orders: డిప్యూటీ కలెక్టర్‌కు డిమోషన్.. సుప్రీం సంచలన తీర్పు

Operation Sindoor: జవాన్ మురళీ నాయక్‌‌కు సీఎం చంద్రబాబు, లోకేష్ నివాళులు

For More AP News and Telugu New

Updated Date - May 09 , 2025 | 07:17 PM