కేసీఆర్ హయాంలో క్రాప్ డ్యామేజ్‌కి ఒక్క రూపాయి ఇవ్వలేదు: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Jul 09 , 2026 | 03:22 PM
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతాంగానికి అవసరమైన సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా, జులై 9 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. రైతాంగానికి అవసరమైన సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో డిప్యూటీ సీఎం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చింతకాని మండలం జగన్నాధపురం మత్కేపల్లి క్రాస్ రోడ్డులో రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులు అందరినీ ఆహ్వానించామని పేర్కొన్నారు.
పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ రైతు భరోసాకు రూ.75 వేల కోట్లు ఖర్చు చేసిందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు కేవలం రెండున్నరేళ్లలో రూ.35 వేల కోట్లను రైతులకు అందజేసిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హయాంలో క్రాప్ డ్యామేజ్‌కి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో రైతుల కోసం పని చేస్తోందని స్పష్టం చేశారు. రైతుభరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లో ఎనిమిది ఎకరాల చొప్పున పూర్తిస్థాయిలో అందరికీ రూ.8759 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. రైతు ఆశీర్వాద సభలో మరో రూ.1900 కోట్లు రైతు భరోసాకు తొమ్మిది ఎకరాల నుంచి యాభై ఎకరాల వరకూ విడుదల చేయనున్నామని తెలిపారు. అన్నదాతలు రైతు ఆశీర్వాద సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి.. సీఎం రేవంత్‌తో హైకమిషనర్ భేటీ
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News