Share News

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

ABN , Publish Date - Jul 08 , 2026 | 07:49 PM

పోక్సో కేసులో జైల్లో ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రేపు (గురువారం) కీలక నిర్ణయం వెలువరించనుంది.

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
Bandi Bhagirath Case

హైదరాబాద్, జులై 8 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో జైల్లో ఉన్న బండి భగీరథ్ (Bandi Bhagirath Case) దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు రేపు (గురువారం) కీలక నిర్ణయం వెలువరించనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేయగా, ఇప్పుడు తుది తీర్పు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కేసు పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఇంతకుముందు పరీక్షలు రాసేందుకు బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ గడువులో పరీక్షలు పూర్తి చేసిన అనంతరం ఆయన తిరిగి జైలుకెళ్లారు. అనంతరం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.


ప్రస్తుతం ఆ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పైనే హైకోర్టు నిర్ణయం వెలువరించనుంది. ఇరుపక్షాల వాదనలు, కేసులోని పరిస్థితులను పరిశీలించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. రేపు వెలువడనున్న తీర్పు ఆధారంగా బండి భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్ లభిస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత రానుంది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై న్యాయవర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి...

డిజిటల్ గవర్నెన్స్‌తో పారదర్శక పరిపాలన అందిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో భారీ ప్రక్షాళన.. అధికారులపై వేటు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 08 , 2026 | 07:57 PM