కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో భారీ ప్రక్షాళన.. అధికారులపై వేటు
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:36 PM
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ముగ్గురు కీలక అధికారులపై ఒకేసారి చర్యలు తీసుకుంది.
ఢిల్లీ, జులై 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ముగ్గురు కీలక అధికారులపై ఒకేసారి చర్యలు తీసుకుంది. పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఉన్నతాధికారులను వారి పదవుల నుంచి తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన రహస్య ఫైళ్లు లీక్ కావడంపై పీఎంఓ సీరియస్ అయింది. మంత్రి వ్యక్తిగత సిబ్బంది నుంచే పర్యావరణ నివేదికలు లీక్ అయినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వ్యక్తిగత సిబ్బందిపై కేంద్రప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. పర్యావరణ శాఖామంత్రి భూపేంద్ర యాదవ్ సెక్రటరీ (PS) అమర్ సింగ్‌ను (IRS) పరిపాలనాపరమైన కారణాలతో తక్షణమే విధుల్లో నుంచి కేంద్రం తొలగించింది. 2010 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అమర్ సింగ్ సేవలను రద్దు చేసి.. తక్షణమే మాతృ సంస్థ అయిన రెవెన్యూ విభాగానికి కేంద్ర ప్రభుత్వం పంపించింది.
పర్యావరణ మంత్రి అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీలు ఆయుశ్ శరణ్, శైలేశ్ కుమార్ సింగ్‌ల నియామకాలను కేంద్రప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. ఒకే రోజు, ఒకే మంత్రిత్వ శాఖకు చెందిన ముగ్గురు కీలక ఉన్నతాధికారులను తొలగించడంపై ఢిల్లీ బ్యూరోక్రసీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తొలగింపు ఉత్తర్వుల కాపీలను ప్రధానమంత్రి కార్యాలయం (PMO), కేబినెట్ సెక్రటేరియట్‌కు పంపడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
కేసీఆర్.. తెలంగాణకు చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి: మంత్రి పొంగులేటి
కాళేశ్వరం పేరుతో కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారు.. మంత్రి సీతక్క ఎద్దేవా
Read Latest Telangana News And And National News
And Telugu News