కాళేశ్వరం పేరుతో కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారు.. మంత్రి సీతక్క ఎద్దేవా
ABN , Publish Date - Jul 06 , 2026 | 03:38 PM
మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరుతో ఆయన డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మహబూబాబాద్, జులై 6 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరుతో ఆయన డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు (సోమవారం) మహబూబాబాద్‌లో పర్యటించి, పలు కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌కు అధికార దాహమే తప్ప... ప్రజలపై ప్రేమ లేదని విమర్శించారు.
పదేళ్లు అధికారంలో ఉండి ఆయన ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. కాళేశ్వరం కట్టింది.. కూలిపోయింది బీఆర్ఎస్ హయాంలోనే అని ప్రస్తావించారు. కాళేశ్వరం పేరుతో లక్షన్నర కోట్లను వృథా చేశారని ఆరోపించారు. మళ్లీ అధికారం కావాలంటున్నారని.. ఆ ప్రాజెక్టులో నీటిని నిల్వచేస్తే పరివాహక గ్రామాలన్నీ కొట్టుకుపోవాలని కేటీఆర్ చూస్తున్నారా..? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2పై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
కన్నెపల్లి పంపు దగ్గరకెళ్లి కేటీఆర్ నాటకమాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News