Share News

ఆ విషయంలో సీఎం చంద్రబాబు సహకరించాలి: కవిత

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:57 PM

తెలంగాణ సీఎం నిర్లక్ష్యంతోనే కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ విషయంలో ఆంధ్రా నాయకులను విమర్శించే కన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అచేతన, నిస్సహాయ స్థితిని తెలంగాణ ప్రజలు తప్పుపడుతున్నారని అన్నారు.

ఆ విషయంలో సీఎం చంద్రబాబు సహకరించాలి: కవిత
Kalvakuntla Kavitha

రాజమహేంద్రవరం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం నిర్లక్ష్యంతోనే కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆరోపించారు. ఈ విషయంలో ఆంధ్రా నాయకులను విమర్శించే కన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అచేతన, నిస్సహాయ స్థితిని తెలంగాణ ప్రజలు తప్పుపడుతున్నారని అన్నారు. రాష్ట్రం విడిపోయేటప్పుడే మనం రూల్స్ ప్రకారం అపెక్స్ కౌన్సిల్ చెప్పే విధానం ప్రకారం నడుచుకోవాలని భావించామన్నారు. ఆ విధంగా మంచి దారిలో నీటి పంపకాలు చేసుకుంటే ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు మంచిగా ఉంటాయని తెలిపారు.


విభజన చట్టం ప్రకారం నీటి వనరులను పంపిణీ చేసుకుందామని ఏపీ సర్కార్‌కు కవిత సూచించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు సహకరించాలని కోరారు. ఈరోజు (సోమవారం) రాజమహేంద్రవరంలో కవిత పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. తన స్నేహితురాలిని పరామర్శించడానికి ఇక్కడకు వచ్చానని తెలిపారు. తన స్నేహితురాలి తల్లి మరణిస్తే ఈ శోక సమయంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చానని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ప్రజలుగా కలిసుండాలని ఆకాంక్షించారు. కృష్ణా నీటి విషయంలో అనుమతులు లేకున్నా ఏపీ తరలించుకుపోతోందని కవిత ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 06:01 PM