పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Nov 22 , 2026 | 03:29 PM
కొంతమంది నేతలు పార్టీకి నష్టం చేసేలా మాట్లాడటం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇన్‌చార్జీకి చెప్పాలని సూచించారు.
హైదరాబాద్: కొంతమంది నేతలు పార్టీకి నష్టం చేసేలా మాట్లాడటం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) పేర్కొన్నారు. పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇన్‌చార్జీకి చెప్పాలని సూచించారు. ఈరోజు (ఆదివారం) పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం గాంధీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తన వల్ల, మంత్రులతో నేతలకు సమస్యలు ఉంటే ఇన్‌చార్జీకి ఫిర్యాదు చేయాలని అన్నారు. ఇన్‌చార్జీకి ఫిర్యాదు చేస్తే తమతో తప్పకుండా చర్చిస్తారని తెలిపారు.
ఈ ఒక్కసారికి వదిలేద్దాం..
పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేయడం తగదని ముఖ్యమంత్రి అన్నారు. దీనివల్ల మంచి చర్చకు రాకుండా పోతుందని చెప్పారు. ఎన్నికల వరకు సందీప్ తెలంగాణకు ఇన్‌చార్జీగా ఉంటారని తెలిపారు. పీఏసీ సమావేశంలో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, అనిరుధ్‌రెడ్డిల అంశం చర్చకు వచ్చింది. వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు కోరారు. ఈ ఒక్కసారికి వదిలేద్దామని సీఎం సూచించారు. ఈసారి మళ్లీ పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంచి మైకులో చెప్పాలి..
మంచి మైకులో చెప్పాలని, చెడు చెవిలో చెప్పాలని సీఎం తెలిపారు. అధిష్ఠానం ఆదేశాలను వందశాతం పాటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని ఉద్ఘాటించారు. కార్యకర్తల కోసం మళ్లీ అధికారంలోకి రావాలని తెలిపారు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు
స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News