ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు
ABN , Publish Date - Nov 21 , 2026 | 10:10 AM
హైదరాబాద్, విజయవాడలో డీజీజీఐ అధికారులు శనివారం మెరుపు దాడులు చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ ఆపరేటర్లు, ఫైనాన్షియర్ల స్థావరాలపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, విజయవాడలో డీజీజీఐ (DGGI) అధికారులు ఈరోజు (శనివారం) మెరుపు దాడులు చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ ఆపరేటర్లు, ఫైనాన్షియర్ల స్థావరాలపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. పేమెంట్ గేట్‌వేల ద్వారా రూ. లక్ష కోట్ల గేమింగ్ లావాదేవీల గుట్టు రట్టు చేశారు. చైనా సంస్థల సహకారంతో ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రూ.వందల కోట్ల క్రిప్టోకరెన్సీ (USDT) చైనా, దుబాయ్, సింగపూర్‌లకు బదిలీ అయినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
డమ్మీ మర్చంట్, వర్చువల్, ఎస్క్రో ఖాతాలతో వేల కోట్ల జీఎస్టీని ఎగవేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా 4 గేమింగ్ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సూపర్ విన్నర్, బిగ్ రమ్మీ విన్నర్, బిగ్ లక్కీ విన్నర్, రమ్మీ రూలర్ యాప్‌ల గుట్టు రట్టు చేశారు. గాలి కిరణ్ కుమార్ స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేశారు. ఫస్ట్ ఫైనాన్స్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎండీ సత్యనారాయణ ఇటాకరి పాత్రపై ఆరాతీశారు. దుబాయ్ పారిపోయేందుకు యత్నించిన నల్సాన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి నళిన్ గుప్తాను అరెస్ట్ చేశారు. లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నళిన్ గుప్తాను అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై రంగంలోకి దిగి ఐటీ, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News