ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:54 PM
ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వ్యాఖ్యానించారు. ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్ స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి టెక్నాలజీ ఎంతో అవసరమని తెలిపారు. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని విజయవంతమైన మోడల్స్ అధ్యయనం చేయాల్సి వచ్చిందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశాన్ని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రోడ్ల అభివృద్ధిలో కొత్త టెక్నాలజీపై ఇరువురు నేతలు చర్చించారు. రెండేళ్లలో రూ.93 వేల కోట్లతో రోడ్ల నిర్మాణమే టార్గెట్‌గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది.
తెలంగాణను 3 రీజియన్లగా అభివృద్ధి: సీఎం రేవంత్‌రెడ్డి
ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రసంగిస్తున్నారు. అభివృద్ధి మూలం మంచి రోడ్లు అని తెలిపారు. ORRతో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను మూడు రీజియన్లగా అభివృద్ధి చేశామిని వివరించారు. సిటీ నుంచి మారుమూల గ్రామాలకు రోడ్ల కనెక్టివిటీ పెంచుతున్నామని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యాధునిక ఆస్పత్రుల నిర్మిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..
Read Latest Telangana News And AP NewsAnd National News
And Telugu News