Share News

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:26 PM

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ASDD జాబితాలో ఉన్న ఓటర్లకు మరో అవకాశం కల్పించారు.

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
Telangana Election Commission

హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ASDD జాబితాలో ఉన్న ఓటర్లకు మరో అవకాశం కల్పించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారికి ఊరట కల్పించారు. గైర్హాజరు, వలస, మరణం, డూప్లికేట్ కేటగిరీల్లో ఉన్నవారికి అవకాశం ఇచ్చారు. నవంబరు 18వ తేదీలోగా ఎన్యూమరేషన్ ఫారాలను ముద్రించాలని పేర్కొన్నారు. నవంబరు 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఫారాల పంపిణీ, సేకరిస్తున్నట్లు తెలిపారు.


డిసెంబరు 10వ తేదీలోగా ఫారాల పరిష్కార ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సర్ (ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియలో కీలక మార్పులు చేసినట్లు తెలిపారు. డిసెంబరు 15వ తేదీ వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, ఆయా సమస్యలు పరిష్కరించనున్నట్లు చెప్పారు. డిసెంబరు 22వ తేదీన తెలంగాణ తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఓటర్ల సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్-1950లో సంప్రదించాలని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సమ్మక్క సాగర్‌ బ్యారేజీ.. ఎన్‌ఓసీ జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం..!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మంత్రి శ్రీధర్‌బాబు

సుప్రీంకోర్టుకు చేరిన 'భారత్ సమ్మిట్' వివాదం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 02:11 PM