తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మంత్రి శ్రీధర్‌బాబు
ABN , Publish Date - Nov 17 , 2026 | 01:34 PM
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గుజరాత్ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గుజరాత్ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు (Telangana Minister Sridhar Babu) పిలుపునిచ్చారు. 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈరోజు (మంగళవారం) అహ్మదాబాద్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రోడ్‌షోకు మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. అలాగే, పారిశ్రామిక మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంధన, ఔషధ, వస్త్ర, రసాయన రంగాల సంస్థలతో మంత్రి వరుసగా భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు.
తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో ముందుకెళ్తున్నాం..
తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి పేర్కొన్నారు. డిసెంబరు 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నామని తెలిపారు. ‘రైజింగ్ టుగెదర్’ నినాదంతో పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కొత్త పెట్టుబడులు.. ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణపై చర్చలు జరుపుతున్నామని అన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ పేర్లతో మూడు ప్రత్యేక ఆర్థిక ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించడమే గ్లోబల్ సమ్మిట్ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇళ్ల పథకం లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ ఊరట
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల
భారత్ సమ్మిట్ వివాదం.. డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన బీజేపీ నేతలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News