Share News

ఇళ్ల పథకం లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ ఊరట

ABN , Publish Date - Nov 16 , 2026 | 04:28 PM

2014కు ముందు ఎంపిక చేసిన ఇళ్ల పథకం లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది. ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్ల వాపస్‌కు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనం కలగనుంది.

ఇళ్ల పథకం లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ ఊరట
Telangana Government

హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): 2014కు ముందు ఎంపిక చేసిన ఇళ్ల పథకం లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఊరట కల్పించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్ల వాపస్‌కు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనం కలగనుందని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్న పట్టాలను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.


22 ఏ భూముల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ అంశం రావడంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. సీఎం ఆదేశాలతో దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న పట్టాల సమస్యకు పరిష్కారం కలిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 05:38 PM