Share News

ఖేలో ఇండియా గేమ్స్‌‌‌కు ప్రధాని మోదీ హాజరవుతారు: మంత్రి శ్రీహరి

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:52 AM

ఖేలో ఇండియా గేమ్స్‌పై తెలంగాణ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖేలో ఇండియా 8వ ఎడీషన్ కబడ్డీ పోటీలు తెలంగాణలో నిర్వహించటం శుభపరిణామమని పేర్కొన్నారు.

ఖేలో ఇండియా గేమ్స్‌‌‌కు ప్రధాని మోదీ హాజరవుతారు: మంత్రి శ్రీహరి
Telangana Minister Vakiti Srihari

మహబూబ్ నగర్ జిల్లా, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఖేలో ఇండియా గేమ్స్‌పై తెలంగాణ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ( Telangana Minister Vakiti Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఖేలో ఇండియా 8వ ఎడీషన్ కబడ్డీ పోటీలు తెలంగాణలో నిర్వహించటం శుభపరిణామమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులకు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. ఈరోజు (మంగళవారం) మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి శ్రీహరి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.


ఖేలో ఇండియా గేమ్స్‌‌కు నిధుల కొరత లేదు..

ఖేలో ఇండియా గేమ్స్‌‌కు నిధుల కొరత లేదని మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం రూ.23 కోట్ల నిధులను కూడా మంజూరు చేసిందని ప్రకటించారు. తమ ప్రభుత్వం రూ.203.36 కోట్లతో మైదానాల్లో వసతులను కల్పిస్తోందని వెల్లడించారు. మరో 20 ఏళ్ల వరకు క్రీడాకారులకు అవసరమయ్యే వసతులను కల్పిస్తామని చెప్పుకొచ్చారు. ఖేలో ఇండియా గేమ్స్‌ ముగింపు ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతారని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇళ్ల పథకం లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ ఊరట

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల

భారత్ సమ్మిట్ వివాదం.. డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన బీజేపీ నేతలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 12:03 PM