సుప్రీంకోర్టుకు చేరిన 'భారత్ సమ్మిట్' వివాదం
ABN , Publish Date - Nov 17 , 2026 | 01:11 PM
'భారత్ సమ్మిట్' వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. భారత రాజకీయాల్లో విదేశీయుల జోక్యం జరుగుతోందంటూ కోర్టులో పిల్ (PIL) దాఖలు చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాది జాహిద్ అలీ పిటిషన్ వేశారు.
ఢిల్లీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): 'భారత్ సమ్మిట్' (Bharat Summit 2026) వివాదం సుప్రీంకోర్టుకు (Supreme Court) చేరింది. భారత రాజకీయాల్లో విదేశీయుల జోక్యం జరుగుతోందంటూ కోర్టులో పిల్ (PIL) దాఖలు చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాది జాహిద్ అలీ పిటిషన్ వేశారు. 'భారత్ సమ్మిట్ 2026' వేదికగా విదేశీ ప్రతినిధులు రాజకీయ నినాదాలు చేశారని పిటిషనర్ ఆరోపించారు. విదేశీ నేత వ్యాఖ్యలు దేశ సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యానికి విఘాతమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాన్ఫరెన్స్ వీసా నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 2025 ఉల్లంఘన జరిగిందని పిటిషనర్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఈ వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా నుంచి వివాదాస్పద వీడియోలను తొలగించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును న్యాయవాది జాహిద్ అలీ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇళ్ల పథకం లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ ఊరట
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల
భారత్ సమ్మిట్ వివాదం.. డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన బీజేపీ నేతలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News