Share News

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..

ABN , Publish Date - Nov 18 , 2026 | 08:10 AM

తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కారుకు రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొంది.

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు  ప్రమాదం..
Balmuri Venkat

హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కారుకు రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర ఈరోజు (బుధవారం) ఉదయం ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆయన వాహనం పూర్తిగా ధ్వంసమైంది.


ఈ ప్రమాదంలో వెంకట్ దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కొత్తూరు బైపాస్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సమ్మక్క సాగర్‌ బ్యారేజీ.. ఎన్‌ఓసీ జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం..!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మంత్రి శ్రీధర్‌బాబు

సుప్రీంకోర్టుకు చేరిన 'భారత్ సమ్మిట్' వివాదం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 08:28 AM