Share News

నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:43 PM

నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. నదీజలాల విషయంలో అన్యాయం జరిగిందని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు.

నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్
KTR

హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) పేర్కొన్నారు. నదీజలాల విషయంలో అన్యాయం జరిగిందని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. పాలమూరు జిల్లా కరువుకు కారణం కాంగ్రెస్సే అని ఆరోపించారు. ఆర్డీఎస్‌(RDS)లో నష్టాన్ని భర్తీ చేసేందుకు తుమ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటు చేసి ఆర్డీఎస్‌ను కేసీఆర్ కాపాడారని అన్నారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్ వేదికగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.


కాంగ్రెస్ ఎన్నో కేసులు వేసింది..

పాలమూరు జిల్లాలో 8లక్షల ఎకరాల ఆయకట్టుకు తమ హయాంలో నీళ్లు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. సాగు, తాగునీరు లక్ష్యంగా పాలమూరు ఎత్తిపోతల మొదలుపెట్టామని ప్రస్తావించారు. పాలమూరు - రంగారెడ్డిని ఆపేందుకు కాంగ్రెస్ ఎన్నో కేసులు వేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో పాలమూరుకే వలసలు వచ్చాయని అన్నారు. ఇప్పుడు మళ్లీ పాలమూరు పరిస్థితి రివర్సైందని చెప్పుకొచ్చారు. సమైక్య పాలకుల కంటే సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ చేస్తున్న ద్రోహం పెద్దదని ఆరోపించారు. సాగర్ నుంచి నీటిని దోచుకుపోతుంటే జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారు..? అని కేటీఆర్ ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సమ్మక్క సాగర్‌ బ్యారేజీ.. ఎన్‌ఓసీ జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం..!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మంత్రి శ్రీధర్‌బాబు

సుప్రీంకోర్టుకు చేరిన 'భారత్ సమ్మిట్' వివాదం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 01:03 PM