Share News

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు

ABN , Publish Date - Nov 21 , 2026 | 07:46 AM

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ అధికారులు శనివారం మెరుపు దాడులు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ సహా పలు చోట్ల సంస్థ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు చేపట్టారు.

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు
Sneha Group IT Raids

హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ అధికారులు ఈరోజు (శనివారం) మెరుపు దాడులు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ సహా పలు చోట్ల ఈ సంస్థ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ కొండాపూర్ కేంద్రంగా పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ రంగాల్లో కార్యకలాపాలను స్నేహ గ్రూప్ నిర్వహిస్తోంది.


ఈ సంస్థ డైరెక్టర్లు రామ్‌రెడ్డి డెండి, వరుణ్ రెడ్డి డెండి, స్నేహ డెండి నివాసాల్లో ఐటీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. 1982లో రామ్‌రెడ్డి చికెన్ మార్కెట్‌‌గా ప్రారంభమై.. 1994లో స్నేహ ఫామ్స్‌‌గా ఈ సంస్థ విస్తరించింది. పౌల్ట్రీ బ్రీడింగ్, చికెన్ ప్రాసెసింగ్, పశువుల దాణా, వంట నూనెల (సఫల బ్రాండ్) తయారీలో స్నేహ గ్రూప్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో గంటకు 12,000 కోళ్లను ప్రాసెస్ చేసే సామర్థ్యం గల ఆటోమేటెడ్ ప్లాంట్‌ను ఈ సంస్థ నిర్వహిస్తోంది. 2,000 మందికి పైగా కాంట్రాక్ట్ రైతులతో కలిసి ఈ సంస్థ వ్యాపారం చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 08:53 AM