కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:15 PM
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
నిజామాబాద్ జిల్లా , నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ (BJP Nizamabad MP Arvind) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఈరోజు (శనివారం) నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఈ జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు చూడాలని సూచించారు. శ్రీకాంత్, ఆచారి లాంటి కుటుంబ సభ్యులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం దిగజారుడుతనమని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పుడు పాల్గొనలేదని.. ఎప్పుడూ తెలంగాణ కోసం కొట్లాడలేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ బలమైన మిత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి శ్రీకాంత్ చారి తల్లికి గతంలో హుజారారాబాద్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఇచ్చారని ఆరోపించారు.
కాళేశ్వరం డిజైన్ తప్పు..
తెలంగాణ కోసం కేసీఆర్ బిడ్డ కవిత ఏం త్యాగం చేశారని.. ఎంపీగా ఓడిపోతే మళ్లీ ఎమ్మెల్సీగా ఎలా చేశారని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. శ్రీకాంత్ కుటుంబంపైన అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం డిజైన్ తప్పు, ప్రతి దాంట్లో తప్పు ఉందని, కాంగ్రెస్ హయాంలోనూ దాన్ని మరమ్మతులు చేయకపోవడం తప్పని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత - చేవెళ్ల గ్రావిటీ ద్వారా ఏర్పాటు చేయాలని నిర్ణయించారని అన్నారు. కాళేశ్వరంలో ఆ రెండు పార్టీలు కేడీలేనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈగోతో మొదలై.. కరప్షన్‌లతో ముగిసిందని ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ పెట్టడం కోసం కాళేశ్వరాన్ని కేసీఆర్ వాడుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ సునామీ సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో గల్లంతవుతాయని ఎంపీ అరవింద్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News