Share News

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

ABN , Publish Date - Nov 22 , 2026 | 05:10 PM

డేటా సెంటర్ల హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. పారిస్‌లో ష్నైడర్ ఎలక్ట్రిక్ ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు.

 తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Telangana Deputy CM Bhatti Vikramarka

ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): డేటా సెంటర్ల హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Telangana Deputy CM Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. పారిస్‌లో ష్నైడర్ ఎలక్ట్రిక్ ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 30వ తేదీన ష్నైడర్ నూతన కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో తయారీ సామర్థ్యాలను ష్నైడర్ సంస్థ విస్తరించాలని సూచించారు.


5 వేల మందికి పైగా ఉపాధి..

డేటా సెంటర్ల రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని భట్టి విక్రమార్క వివరించారు. విద్యుదీకరణ, డిజిటలైజేషన్, ఆటోమేషన్‌కు తెలంగాణలో విస్తృత అవకాశాలు ఉన్నాయని ప్రస్తావించారు. తెలంగాణలో ఇప్పటికే ష్నైడర్‌కు తయారీ, పరిశోధన యూనిట్లను నెలకొల్పుతున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఈ సంస్థ ద్వారా 5 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి లైట్‌హౌస్ యూనిట్‌గా తెలంగాణ కేంద్రానికి గుర్తింపు ఉందని వివరించారు. తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం

ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 05:34 PM