Share News

రేవంత్ ఆ పని చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కేటీఆర్ ఛాలెంజ్

ABN , Publish Date - Nov 22 , 2026 | 08:44 PM

సీఎం రేవంత్‌రెడ్డి సర్కారుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ హై కమాండ్‌కు గులాం చేస్తున్నారని విమర్శించారు.

రేవంత్ ఆ పని చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కేటీఆర్ ఛాలెంజ్
KTR

వరంగల్ జిల్లా, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి సర్కారుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ హై కమాండ్‌కు గులాం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మహిళలను కోటీశ్వరులు చేయడం దేవుడెరుగని... లక్షాధికారులను చేసి చూపెట్టాలని సవాల్ చేశారు. మహిళలను లక్షాధికారులను చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. వరంగల్ నగరంలో ఈరోజు (ఆదివారం) నిర్వహించిన బీఆర్ఎస్ జనచైతన్య బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ 420 హామీలు ఇచ్చి ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. దేశంలోనే అతిపెద్ద దావాఖానాను వరంగల్‌లో మాజీ సీఎం కేసీఆర్ నిర్మించారని ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకూ రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు వరంగల్‌లో ఐటీ రంగాన్ని నాశనం చేశారని ఆగ్రహించారు.


అందుకే ఇంటర్మీడియట్ కాలేజీలను తీసేస్తున్నారు..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి తమ ప్రభుత్వంలో అవినీతి ఉందని చెబుతున్నారని కేటీఆర్‌ అన్నారు. కొండా సురేఖ బిడ్డ, సురేఖ కూడా ఈ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారని ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి బిడ్డ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డల కోసం ఇంటర్మీడియట్ కాలేజీలను తీసేస్తున్నారని ఆరోపించారు. ఈ ముఖ్యమంత్రి వరంగల్ అభివృద్ధికి చేసిందేమీలేదని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి అభివృద్ధి చేస్తానంటే తాను ఏమైనా అడ్డమొచ్చానా..? అని ప్రశ్నించారు. వరంగల్ నగరానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలిపారు. హైదరాబాద్ ప్యూచర్ సిటీలో ప్యూచర్ లేదని... వరంగల్లే ప్యూచర్ సీటీ అని స్పష్టం చేశారు. కాళోజీ కళాక్షేత్రంలో కూడా ఆఫీసు పెడతమన్నారని... ఇక్కడ బీఆర్ఎస్ సభ ఉందని తెలియగానే నిర్ణయం వెనక్కు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు అమిత్ షాకు వత్తాసు పలకడం తప్పా.. తెలంగాణ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అన్నారు.


500 రోజుల్లో అధికారంలోకి బీఆర్ఎస్..

తెలంగాణలో 500 రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పక్కా అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. ఉద్యమ సమయంలో వరంగల్‌లో తనకు, పార్టీకి చాలా అనుబంధం ఉందని ప్రస్తావించారు. వరంగల్‌లో తాము ఏ సభ పెట్టినా విజయవంతం అయిందని తెలిపారు. కరోనా సమయంలోనూ బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం ఆగలేదని గుర్తుచేశారు. ఎన్నికల టైంలో కేసీఆర్ అబద్ధాలు చెప్పలేదని అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డికి చేతులు రావట్లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ హయాంలోనే వరంగల్‌కు ఐటీ కంపెనీలు వచ్చాయని వెల్లడించారు. కొండా సురేఖ కుమార్తె ఏం చెప్పిందో అందరికీ తెలుసునని అన్నారు. రేవంత్‌రెడ్డివి ప్రజలకు అమోదయోగ్యం కాని ఆలోచనలని విమర్శించారు. వరంగల్‌ను ఫ్యూచర్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మోసపోతే గోస పడతామని కేసీఆర్ ఆనాడే చెప్పారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి మోకరిల్లుతున్నారని కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం

ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు

స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 10:15 PM