హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
ABN , Publish Date - Nov 22 , 2026 | 06:19 PM
హైదరాబాద్‌లో దాడులకు పాల్పడుతామంటూ ఉగ్రవాదుల పేరుతో వచ్చిన ఈ-మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. నగరంలో రెండు చోట్ల దాడులు జరుపుతామంటూ దుండగులు హైదరాబాద్ సీపీ, స్పెషల్ బ్రాంచ్‌కు మెయిల్ పంపించినట్లు సమాచారం అందుతోంది.
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): నగరంలో దాడులకు పాల్పడుతామంటూ ఉగ్రవాదుల పేరుతో వచ్చిన ఈ-మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. నగరంలో రెండు చోట్ల దాడులు జరుపుతామంటూ దుండగులు హైదరాబాద్ సీపీ, స్పెషల్ బ్రాంచ్‌కు మెయిల్ పంపించినట్లు సమాచారం అందుతోంది. దీంతో రాష్ట్ర పోలీసులు హై అలర్ట్ అయ్యారు. లష్కరే తోయిబా పేరుతో హైదరాబాద్ పోలీసులకు బెదిరింపు మెయిల్ వచ్చిందని.. హైదరాబాద్‌లో 26/11 తరహా ఉగ్రదాడులు చేస్తామని.. కాచిగూడ రైల్వేస్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా లక్ష్యంగా దాడులు జరుపుతామంటూ ఆ మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
బాంబు పేలుళ్లతో 300 మందిని హతమారుస్తామని.. తమ నాయకుడు లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగా దాడులు చేస్తామంటూ మెయిల్‌లో హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బెదిరింపు ఈ-మెయిల్‌తో హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కాచిగూడ రైల్వేస్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, ప్రార్థనా మందిరాల వద్ద నిఘా పెంచారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బాంబు నిరోధక తనిఖీలు, నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని.. అన్ని భద్రతా విభాగాలతో సమన్వయం చేసుకోవాలని స్పెషల్ బ్రాంచ్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ-మెయిల్‌లో ఏముందంటే..
‘హైదరాబాద్‌లో భారీ పేలుళ్లు జరుపుతాం. 26/11 తరహాలో హైదరాబాద్‌లో దాడులు చేస్తాం. కనీసం 300 మందిని చంపేలా దాడులు ఉంటాయి. భారత సైన్యంపై ప్రతీకారం తీర్చుకుంటాం. తమ నాయకుడు లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగా దాడులు చేస్తాం. కాచిగూడలోని హోటల్ టూరిస్ట్ ప్లాజా, కాచిగూడ రైల్వేస్టేషన్ లక్ష్యంగా దాడులకు పాల్పడుతాం. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు. ఈ రోజే దాడులు చేస్తాం’ అంటూ లష్కరే తోయిబా పేరుతో సీపీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు మెయిల్ వచ్చినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు
స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News