సుబేదార్‌గంజ్-యశ్వంతపూర్ మార్గంలో 26 ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Sep 04 , 2026 | 08:24 AM
పండుగల సీజన్‌లో పెరగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉత్తరప్రదేశ్‌లోని సుబేదార్‌గంజ్ నుంచి.. సికింద్రాబాద్ మీదుగా యశ్వంతపూర్ మార్గంలో 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
11నుంచి డిసెంబరు 7వరకు అందుబాటులో..
హైదరాబాద్ సిటీ: పండుగల సీజన్‌లో పెరగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉత్తరప్రదేశ్‌లోని సుబేదార్‌గంజ్ నుంచి.. సికింద్రాబాద్ మీదుగా యశ్వంతపూర్ మార్గంలో 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 11 నుంచి డిసెంబరు 7వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. 04135 ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం సుబేదార్‌గంజ్ నుంచి,
04136 ప్రత్యేక రైలు ప్రతి సోమవారం యశ్వంతపూర్ నుంచి బయల్దేరుతాయని పేర్కొన్నారు. ఈ రైళ్లకు శంకర్‌ఘర్, దబోరా, మాణిక్‌పుర్, సత్నా, కాట్ని, జబల్‌పూర్, ఇటార్సి, నాగపూర్, బలార్ష, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఖాజీపేట్, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, ఎలహంక స్టేషన్లలో ఇరువైపులా హాల్ట్ ఉంటుందని తెలిపారు.
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మార్గంలో..
నేడు 2 జన సాధారణ్ ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రెండు జన సాధారణ్ (అన్ రిజర్వ్‌డ్) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. 07235 ప్రత్యేకరైలు శుక్రవారం మధ్యాహ్నం 12.10గంటలకు బయల్దేరి, సిర్పూర్ కాగజ్‌నగర్‌కు సాయంత్రం 5.30గంటలకు చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో 07236 ప్రత్యేక రైలు సాయంత్రం 6గంటలకు బయల్దేరి సికింద్రాబాద్‌కు రాత్రి 11.15గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. చర్లపల్లి, భువనగిరి, జనగాం, ఖాజీపేట్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో హాల్ట్ ఉంటుందని, ఈ రైళ్లకు అన్ని జనరల్ బోగీలు మాత్రమే ఉంటాయని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..
పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకుంది
Read Latest AP News And Telangana News And International News And Telugu News