ఎలుకల భీకర పోరు.. చివరకు ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Sep 04 , 2026 | 07:09 AM
అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్‌లో రెండు ఎలుకలు పోట్లాడుకున్నాయి. ఒక దానితో ఒకటి ముష్టి యుద్ధం చేశాయి. ఎలుకల పోరును అక్కడున్న ప్రయాణికులు ఎంతో ఎంజాయ్ చేస్తూ వీక్షించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్‌లో రెండు ఎలుకలు పోట్లాడుకున్నాయి. ఒక దానితో ఒకటి ముష్టి యుద్ధం చేశాయి. ఎలుకల పోరును అక్కడున్న ప్రయాణికులు ఎంతో ఎంజాయ్ చేస్తూ వీక్షించారు. ఈ సంఘటన ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 28వ తేదీన ఆక్స్‌ఫర్డ్ సర్కస్ అండర్ గ్రౌండ్ స్టేషన్‌లోని ఐరన్ ఫ్లోర్‌పై రెండు ఎలుకలు గొడవపడ్డాయి. ఒక దానితో ఒకటి ముష్టి యుద్ధం చేశాయి. ఇది చూసిన అక్కడి ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొంతమంది ఎలుకల బాక్సింగ్‌ను వీడియో తీయటం మొదలెట్టారు.
యాభై సెకన్ల పాటు గొడవపడ్డ తర్వాత ఓ ఎలుక అక్కడినుంచి పారిపోయింది. తర్వాత రెండో ఎలుక కూడా అక్కడినుంచి వెళ్లిపోయింది. ఓ వ్యక్తి ఎలుకల బాక్సింగ్‌కు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఎలుకల బాక్సింగ్‌ను లైవ్‌లో చూసిన వాళ్లు చాలా అదృష్టవంతులు’..‘ఎలుకల బాక్సింగ్‌లో విజేతకు ఏం బహుమతి ఇచ్చారు?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రియురాలికి ఐఫోన్ కొనిచ్చేందుకు గంజాయి రవాణా
హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 12గంటల నుంచి కరెంట కట్