నవంబర్ 4 నుంచి 8 ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పులు
ABN , Publish Date - Sep 04 , 2026 | 07:59 AM
ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పులు చేశామని, నవంబరు 4 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
హైదరాబాద్ సిటీ: ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పులు చేశామని, నవంబరు 4 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. ‘త్రివేండ్రం-చర్లపల్లి (17042) ఎక్స్‌ప్రెస్ గుంటూరుకు సాయంత్రం 5 గంటలకు, సత్తెనపల్లికి 5.45 గంటలకు చేరుకుంటుంది. తిరుచిరాపల్లి-చర్లపల్లి (17078) ఎక్స్‌ప్రెస్ గుంటూరుకు మధ్యాహ్నం 2.40 గంటలకు, సత్తెనపల్లికి 3.20 గంటలకు, నడికుడికి సాయంత్రం 4 గంటలకు చేరుతుంది. అలాగే, కాచిగూడ- రేపల్లె ఎక్స్‌ప్రెస్ పిడుగురాళ్లకు రాత్రి 2.40 గంటలకు,
త్రివేండ్రం- సికింద్రాబాద్ (20630) మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్ సత్తెనపల్లికి ఉదయం 6.45 గంటలకు చేరుకుంటాయి. గుంటూరు-కాచిగూడ (17251) ఎక్స్‌ప్రెస్ రైలు సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతుంది. నవంబరు ఏడు నుంచి మైసూరు నుంచి కాకినాడ వెళ్లే (17290) ఎక్స్‌ప్రెస్, 6 నుంచి హిసార్ - కాకినాడ (17296), చర్లపల్లి - తిరుపతి (17444) ఎక్స్‌ప్రెస్‌ల వేళల్లోనూ స్వల్ప మార్పులు చేశాం’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..
పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకుంది
Read Latest AP News And Telangana News And International News And Telugu News