Share News

నిప్పులు చెరిగిన భువి.. సెలక్టర్లకు అగ్నిపరీక్ష!

ABN , Publish Date - Sep 04 , 2026 | 07:30 AM

టీమిండియాకు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి తన సత్తా చాటాడు. యూపీ టీ20 లీగ్‌ 2026లో లఖ్‌నవూ ఫాల్కన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. అద్భుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

నిప్పులు చెరిగిన భువి.. సెలక్టర్లకు అగ్నిపరీక్ష!
Bhuvneshwar Kumar

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. జట్టులో స్థానం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాడు. దేశవాళీ, ఐపీఎల్.. ఇలా అవకాశం దొరికిన ప్రతి వేదికపై భువి ప్రతిభను చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి సత్తాచాటిన భువి.. సెలెక్టర్లకు అగ్ని పరీక్ష పెట్టాడు. యూపీ టీ20 లీగ్ 2026లో భువనేశ్వర్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...


యూపీ టీ20 లీగ్2026లో భువనేశ్వర్ లఖ్‌నవూ ఫాల్కన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలి క్యాలిఫయర్‌లో మావెరిక్స్, లఖ్‌నవూ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ ఫాల్కన్స్ 19.4 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. జీషన్‌ అన్సారీ నాలుగు వికెట్లు తీసి.. ఫాల్కన్స్‌ బ్యాటర్లను కట్టడి చేశాడు. కార్తీక్‌ త్యాగి రెండు, విశాల్‌ చౌదరి ఒక వికెట్ సాధించారు. ఫాల్కన్స్‌ ఇన్నింగ్స్‌లో హిమాన్షు సింగ్‌ (61) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం 146 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భువనేశ్వర్‌ కుమార్‌ మ్యాజిక్‌ చేశాడు. దీంతో మీరట్ మావెరిక్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 98 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఫాల్కన్స్‌ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.


మావెరిక్స్‌ బ్యాటర్లలో రింకూ సింగ్‌ (34), జీషన్‌ అన్సారీ (30*) పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. లఖ్‌నవూ బౌలర్లలో భువి నాలుగు వికెట్లు తీయగా... అభినందన్‌ సింగ్‌ రెండు వికెట్లు సాధించాడు. అలానే కృష్ణ్‌ కుమార్‌ సరోజ్, విప్రాజ్‌ నిగమ్‌ చెరో వికెట్ పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో తర్వాత భువీ తిరిగి టీమిండియా వైపు చూస్తున్నాడు. 2022 నవంబర్‌లో చివరిసారి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. తాజా యూపీ టీ20 లీగ్‌లో ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాడు.


ఇవి కూడా చదవండి:

‘ఇంపాక్ట్‌’గా ధోనీ విముఖత

విక్టర్‌కు శ్రీకాంత్‌ షాక్‌

Updated Date - Sep 04 , 2026 | 07:37 AM