Share News

‘ఆరు’పై అబ్బాయిలు.. హ్యాట్రిక్‌పై అమ్మాయిల గురి

ABN , Publish Date - Sep 04 , 2026 | 02:00 AM

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీలో డిఫెండింగ్‌ చాంపియన్లుగా బరిలోకి దిగుతున్న భారత్‌ అండర్‌-21 పురుషుల, మహిళల జట్లు మరోసారి టైటిల్‌ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి.

‘ఆరు’పై అబ్బాయిలు.. హ్యాట్రిక్‌పై అమ్మాయిల గురి

మోక్వి (చైనా): జూనియర్‌ ఆసియాకప్‌ హాకీలో డిఫెండింగ్‌ చాంపియన్లుగా బరిలోకి దిగుతున్న భారత్‌ అండర్‌-21 పురుషుల, మహిళల జట్లు మరోసారి టైటిల్‌ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి. శుక్రవారం టోర్నీ ఆరంభం కానుండగా.. భారత జట్ల ఆరంభ మ్యాచ్‌లను శనివారం షెడ్యూల్‌ చేశారు. పురుషుల జట్టు రికార్డు స్థాయిలో ఆరో టైటిల్‌పై కన్నేయగా.. మహిళల టీమ్‌ హ్యాట్రిక్‌పై గురిపెట్టింది. డిఫెండర్‌ అన్‌మోల్‌ ఎక్కా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పూల్‌-ఎలో ఈ నెల 5న ఇండోనేసియాతో, 6న జపాన్‌తో, 8న కొరియాతో, 9న చైనీస్‌ తైపీతో భారత్‌ ఆడనుంది. ఇక ఖైడెమ్‌ షిలీమాచాను సారథ్యంలోని అమ్మాయిల టీమ్‌.. ఈ నెల 5న తమ తొలి మ్యాచ్‌లో కొరియాతో తలపడనుంది. 6న మలేసియాతో, 8న జపాన్‌తో, 9న చైనాతో భారత్‌ ఆడనుంది.

ఇవి కూడా చదవండి:

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్

Updated Date - Sep 04 , 2026 | 02:00 AM