సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్
ABN , Publish Date - Sep 02 , 2026 | 07:05 PM
విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.
విజయవాడ: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 సీఐ నాగరాజు, A3 హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, A5 హెడ్ కానిస్టేబుల్ బాబురావు, A6 సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.
సాయి కృష్ణ లాకప్ డెత్‌కు సంబంధించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం A1 సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. A3 జంగం నాని ఏలూరు సబ్ జైలులో, A5 బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, A6 సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు నిందితులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం వారి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో నలుగురూ ప్రస్తుతం జైల్లోనే కొనసాగనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది.
Also Read:
గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు
రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి