ఆదాయానికి మించి ఆస్తుల కేసు.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
ABN , Publish Date - Sep 03 , 2026 | 10:29 AM
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లోకనాథంను ఈరోజు ఉదయం అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి, సెప్టెంబర్ 3: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లోకనాథంను ఈరోజు(గురువారం) ఉదయం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నిన్న(బుధవారం) లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. లోకనాథం నివాసంతోపాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. తిరుపతి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వరంలో ఐదు బృందాలుగా ఏర్పడి సోదాలు చేపట్టారు.
ఈ దాడుల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12.50 లక్షల నగదు లభ్యమైంది. భార్య, కుమారుడి పేర్లతో ఇళ్లు, స్థలాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. నిన్న ఉదయం నుంచి చేపట్టిన సోదాలు ముగియడంతో ఈరోజు లోకనాథంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
గంజాయి డాన్ నీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు
రెండు చక్రాలపై ఆటో డ్రైవర్ ప్రమాదకర స్టంట్..
Read Latest AP News And Telugu News