చంద్రబాబు పాదయాత్రలో పుట్టిందే పురుషోత్తపట్నం: మాజీ ఎమ్మెల్యే వర్మ
ABN , Publish Date - Sep 03 , 2026 | 09:25 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపర భగీరథుడని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ అభివర్ణించారు. పురుషోత్తపట్నం నుంచి పోలవరం నీళ్లు ఎత్తిపోసి ఉత్తరాంధ్రను చంద్రబాబు సస్యశ్యామలం చేశారని అన్నారు.
కాకినాడ, సెప్టెంబర్ 03: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపర భగీరథుడని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ అభివర్ణించారు. పురుషోత్తపట్నం నుంచి పోలవరం నీళ్లు ఎత్తిపోసి ఉత్తరాంధ్రను చంద్రబాబు సస్యశ్యామలం చేశారని అన్నారు. గురువారం జిల్లాలోని కత్తిపూడి సమీపంలోని పోలవరం ఎడమ కాలువ జలాలకు ఆయన పూజ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్రలో పుట్టిందే పురుషోత్తపట్నం అని గుర్తు చేశారు.
ఈ పురుషోత్తపట్నం ప్రాజెక్టు రూ.1,650 కోట్లతో సీఎం చంద్రబాబు పూర్తి చేశారని ఆయన వివరించారు. పురుషోత్తపట్నంకి పిఠాపురంలోనే శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఆపివేయాలంటూ గతంలో కేంద్రానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేఖలు రాశారని పేర్కొన్నారు. పట్టిసీమ ఇస్తే.. వైఎస్ జగన్ వెకిలి నవ్వులు నవ్వాడంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో సుజల స్రవంతిని అడ్డుకున్నాడంటూ వైసీపీ అధినేతపై ఈ సందర్భంగా వర్మ నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని పురుషోత్తపట్నం పనులు జరగనివ్వలేదని విమర్శించారు.
పిఠాపురం రైతులకు అన్యాయం చేయడానికి ఏలేరు నుంచి పైపులు పెట్టి తాండవ నదికి నీరు తీసుకెళ్లడానికి అప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేలతోపాటు ఎంపీ ప్రయత్నించారని ఆరోపించారు. పురుషోత్తపట్నం వల్ల ఏలేరు ప్రాజెక్టు పరిధిలో ఐదు నియోజకవర్గాల రైతులకు సాగునీరు అందుతుందని వివరించారు. పురుషోత్తపట్నం ద్వారా లక్ష ఎకరాల్లో.. రెండు పంటలకు సాగునీరు అందుతుందని హర్షం వ్యక్తం చేశారు. పురుషోత్తపట్నం నుంచి పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా 3,400 క్యూసెక్కులు నీరు అనకాపల్లి వెళ్లిందని వివరించారు. అలాగే గ్రావిటీ ద్వారా తునికి సాగునీరు వెళ్తుందని మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్రెగుట్టల్లో పేలిన మందుపాతర.. ఒకరి మృతి'
స్నేహితులే కిడ్నాపర్లు.. నాని క్రికెట్ ప్రిడిక్షన్ యాప్ నిర్వాహకుడికి విముక్తి
For More AP News And Telugu News