Share News

రెండు చక్రాలపై ఆటో డ్రైవర్ ప్రమాదకర స్టంట్..

ABN , Publish Date - Sep 03 , 2026 | 09:59 AM

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి గంజాయి మత్తులో ఓ ఆటో డ్రైవర్ హల్‌చల్ చేశాడు. గంజాయి సేవించి నిర్లక్ష్యంగా ఆటో నడుపుతూ రోడ్డుపై ప్రమాదకరంగా స్టంట్లు చేశాడు.

రెండు చక్రాలపై ఆటో డ్రైవర్ ప్రమాదకర స్టంట్..
Hyderabad auto driver

హైదరాబాద్‌, సెప్టెంబర్ 3: నగరంలోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి గంజాయి మత్తులో ఓ ఆటో డ్రైవర్ హల్‌చల్ చేశాడు. గంజాయి సేవించి నిర్లక్ష్యంగా ఆటో నడుపుతూ రోడ్డుపై ప్రమాదకరంగా స్టంట్లు చేశాడు. మెహదీపట్నం-రెతిబౌలి మార్గంలోని పిల్లర్ నంబర్ 41 సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆటోను రెండు చక్రాలపై నడుపుతూ డ్రైవర్ స్టంట్ చేయడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.


అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తికి ఈ ప్రమాదకర స్టంట్ కారణంగా త్రుటిలో ప్రమాదం తప్పింది. దీంతో అప్రమత్తమైన బైక్ రైడర్ ఆటోను అడ్డగించి డ్రైవర్‌ను పట్టుకున్నాడు. అనంతరం ఆటో డ్రైవర్‌ను వీడియో తీసిన బైక్ రైడర్.. ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి...

స్నేహితులే కిడ్నాపర్లు.. నాని క్రికెట్ ప్రిడిక్షన్ యాప్ నిర్వాహకుడికి విముక్తి

గంజాయి డాన్ నీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 10:02 AM